రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Sep 13 2025 2:34 AM | Updated on Sep 13 2025 2:47 AM

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు హేమంత్‌ కుమార్‌ అక్టోబర్‌ 12న చెస్‌ పోటీలు ఎన్‌సీసీ ఫైరింగ్‌ సెలక్షన్‌ క్యాంప్‌ 9 లక్షల టన్నుల ధాన్యం లక్ష్యం

కొయ్యలగూడెం: జిల్లా స్థాయిలో నిర్వహించిన ఫుట్‌బాల్‌, సెపక్‌తక్రా పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల ప్రతినిధులు శుక్రవారం పేర్కొన్నారు. ఈనెల 11న పెదవేగిలో నిర్వహించిన ఫుట్‌బాల్‌ అండర్‌–19 విభాగంలో పదో తరగతి చదువుతున్న కోమటి గుంట మనోజ్‌ కుమార్‌, రామని బాలాజీ, గుర్రం వెంకటలక్ష్మి ప్రతిభ చూపి ఆకట్టుకున్నారన్నారని ప్రధానోపాధ్యాయుడు కె.రవికుమార్‌ తెలిపారు. దీంతో వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారని తెలిపారు. అదేవిధంగా కొయ్యలగూడెం వీఎస్‌ఎన్‌ కళాశాలలో ఇంటర్‌ అభ్యసిస్తున్న పాక దుర్గా మధుర శ్రీ జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని సెపక్‌తక్రా విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది ఈ సందర్భంగా విద్యార్థులను ఎస్‌ఎంసి చైర్మన్‌ కోడి నాగలక్ష్మి, పీఈటి సురేష్‌ అభినందించారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సెకండియర్‌ విద్యార్థి హేమంత్‌ కుమార్‌ ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అండర్‌–19 బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. హేమంత్‌ కుమార్‌, వ్యాయామ అధ్యాపకుడు మాణిక్యం రాజాను ప్రిన్సిపాల్‌ నాగవేణి, అధ్యాపక బృందం అభినందించారు.

భీమవరం: తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు అక్టోబర్‌ 12న భీమవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాదాసు కిషోర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ల ఆవిష్కరణ శుక్రవారం నిర్వహించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజేతలకు రూ.లక్ష నగదు బహుమతులు, క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.

తాడేపల్లిగూడెం: ఎన్‌సీసీ బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి ఐజీసీఆర్‌డీసీ సెలక్షన్‌ క్యాంపు కమాండెంటు కల్నల్‌ అమిత్‌ పాండే ఆధ్వర్యంలో శుక్రవారం వరకు నిర్వహించారు. ఈ శిబిరంలో డ్రిల్‌ ఫైరింగ్‌, కల్చరల్‌ ప్లాగ్‌ విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ ఎంపికై న వారు గుంటూరులో జరగనున్న క్యాంపులో పాల్గొంటారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రస్తుత ఖరీఫ్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు లక్ష్యాలను నిర్దేశించినట్టు జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాకినాడలో శుక్రవారం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల అధికారుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ విషయం వెల్లడించారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5 లక్షలు, ఏలూరు జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక 1
1/1

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement