
లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి
ఏలూరు (టూటౌన్): ఈ నెల 13న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయమూర్తి చాంబరులో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేశామని, మండల న్యాయ సేవాధికార సంస్థలను సంప్రదించి ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ లోక్ అదాలత్‌లో 4,802 పెండింగ్ కేసులను రాజీయోగ్యంగా గుర్తించామని, 2,225 ప్రీ లిటిగేషన్ కేసులను గుర్తించామని చెప్పారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంటు కోనె సీతారాం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.