
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
గణపవరం (నిడమర్రు): పిప్పర గ్రామంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్.కొండేపాడు వీఆర్వో అడబాల రామకృష్ణ ప్రసాద్ మృతిచెందారు. గణపవరం ఎస్సై మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణ ప్రసాద్ స్వగ్రామం వీరేశ్వరపురం నుంచి విధుల నిమిత్తం ఎస్.కొండేపాడు వెళ్తుండగా.. మధ్యలో పిప్పరలోని రాజ్ కళ్యాణ మండపం వద్ద వ్యాన్ వెనక నుంచి ఢీకొనడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి తాడేపల్లిగుడెం ప్రభుత్వ అసుపత్రిలో పోస్ట్‌మార్ట్ అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. తహసీల్దారు అప్పారావు, కార్యాలయం సిబ్బంది వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
దెందులూరు: గోదావరి కాలువలో దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు దెందులూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి చేతి మీద సత్య అని రాసి ఉందని 40 సంవత్సరాలు వయసు ఉంటుందని ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే సంప్రదించాలన్నారు.