
వరిని ఆశించే పురుగులతో ఇక్కట్లు
మండవల్లి: కాండం తొలుచు పురుగు, ఆకునల్లి తదితర రకాల పురుగుల వల్ల వరి రైతులు తీరని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాండం తొలుచు పురుగు వరి పంటలో కనిపించే అతి ముఖ్యమైన పురుగు. ఇది ఖరీఫ్ రబీల్లో కూడా కనిపిస్తూ ఎక్కువ నష్టాని కలుగజేస్తుంది. ఇది ఒకే పంటను ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు లైంగిక గుడ్డు నుంచి వచ్చే చిన్న పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ చద్విరూకత కలిగి ఉంటాయి. ఆడ పురుగులు, మగ పురుగులు కొన్ని గుర్తింపు చిహ్నాల ద్వారా లింగ భేదం చేయవచ్చు, ఆడ పురుగు మగ పురుగుకన్నా పెద్దగా లావుగా ఉండి , లేత పసుపు రంగులో ఉంటుంది. ఆడ పురుగు మొదటి జత రెక్కలపైన మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంటుంది. మగ పురుగు ముందు రెక్కలపై నల్లటి మచ్చ ఉండదు.
వరికాండానికి పెద్ద దెబ్బ
ఈ పురుగులు గుడ్డు నుంచి వచ్చే చిన్న పురుగులు కొన్ని గంటల పాటు ఆకులపై తిరుగుతూ ఊలు దారంతో వేలాడుతాయి. ఇవి ఆకుల తొడిమి లోకి ప్రవేశించి కాండంను తింటూ లోపలకు చేరి లోపలి భాగాన్ని తింటాయి. ఈ పురుగు వరిపైరును పిలకలు వేసే దశ, చిరుపొట్ట దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగులు పైరును వరి పంటను పిలకలు వేసే దశలో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. క్లోరో నియంతప్రోల్ మందు ఎకరానికి 60 మి.లీ, కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ మందు 2 గ్రాములు ఒక లీటరు నీటికి అసెఫెట్ ఒక గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాండం తొలుచు పురుగు వరిపైరును పిలకలు వేసేదశ, చిరుపొట్ట దశల్లో ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. వ్యవసాయాధికారుల సూచనలతో దీనిని నివారించుకోవచ్చు.
– నల్లమోతు వేణుగోపాలరావు, మండవల్లి
ఇవి ఆకుల తొడిమిలోకి ప్రవేశించి కాండంను తింటూ లోపలికి చేరి లోపలి భాగాన్ని తింటాయి. దీంతో వరిపైరుకు బాగా నష్టం ఏర్పడుతుంది.
– పందిళ్ళ సూర్యనారాయణ, మండవల్లి
వరిని ఆశించే ఆడ, మగ కాండం తొలుచు పురుగులు