
నాటుసారా కేంద్రాలపై దాడి
కుక్కునూరు: నాటుసారా తయారీ కేంద్రాలపై ఆదివారం కుక్కునూరు పోలీసులు దాడి చేసి 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి వివరాల ప్రకారం, మండలంలోని సీతారామనగరం గ్రామ శివారులోని కిన్నెరసాని వాగు ఒడ్డున నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం దాడులు నిర్వహించినట్టు చెప్పారు. దాడులలో సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 600 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకోని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 10 లీటర్ల నాటుసారాను ఓ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సారా నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని భవిష్యత్తులో ఇలాంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు.