
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో బుధవారం తాచు పాము కలకలం రేపింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో స్వామివారి మహా నివేదన నిమిత్తం దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఆ సమయంలో ఉత్తరం వైపు ఉన్న దర్శనం క్యూలైన్లలోకి ఒక పెద్ద తాచు పాము ప్రవేశించింది.
దర్శనం నిలుపుదల కావడంతో క్యూలైన్లలో భక్తులెవరూ లేరు. దాంతో పెనుప్రమాదం తప్పింది. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు అక్కడికి చేరుకుని, గార్డెన్ సిబ్బందితో ఆ పామును చంపించారు. అనంతరం దాన్ని దూరంగా తీసుకెళ్లి పడేశారు.