
ఆకట్టుకున్న నిమ్మకాయల అలంకరణ
9న ఏపీ నిట్ స్నాతకోత్సవం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఏడో స్నాతకోత్సవం ఆగస్టు 9న నిర్వహించనున్నారు. ఈ మేరకు నిట్ అధికారవర్గాలు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా టీసీఎస్ లిమిటెడ్, టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రెసిడెంట్ వి.రాజన్న ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యుత్ మోటార్ దొంగలించిన వ్యక్తికి ఆరు నెలల జైలు
భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో అనాకోడేరు గ్రామానికి చెందిన యర్రంశెట్టి విజయ రామరాజు తన చెరువు వద్ద విద్యుత్ మోటార్ దొంగిలించినట్లు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ మోటార్ దొంగిలించిన నేపాల సూర్యనారాయణను శుక్రవారం కోర్టులో హాజరుపర్చగా నేరం రుజువు కావడంతో సీనియర్ సివిల్ జడ్జి సురేష్ సూర్యనారాయణకు నిందితుడికి 6 నెలలు జైలు శిక్ష విధించినట్లు రూరల్ ఎస్సై ఐ.వీర్రాజు తెలిపారు.