
నగదు చోరీ కేసులో నిందితుల అరెస్ట్
భీమవరం (ప్రకాశంచౌక్): స్కూటర్ డిక్కిలో రూ.3 లక్షల నగదు చోరి చేసిన కేసులో నిందితుల అరెస్ట్ చేశామని డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. జూలై 4న అమలాపురం నుంచి వచ్చిన బాధితుడు ఎం.రమేష్ బాబు నగదును వేరొకరికి ఇద్దామనుకున్నారు. కళాభవన్ వీధిలో ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చేలోపు డిక్కీ తెరిచి నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా విజయనగరం జిల్లాకు చెందిన మేకల బాలరాజు, ఒడిశాకు చెందిన దాసు రబి (రవి) నగదు చోరీ చేశారని గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల సొమ్మును రికవరీ చేశారు.