భీమడోలు: మండంలోని పొలసానిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను తక్షణమే నిర్మించాలని, తాత్కాలిక షెడ్లను నిర్మించి బాలికలకు తరగతులను నిర్వహించాలని సీపీఎం ప్రతినిధుల బృందం డిమాండ్ చేసింది. పోలసానిపల్లిలో రెండు శ్లాబ్‌లు కూలడం, ఓ విద్యార్థీనీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం సీపీఎం ప్రతినిధుల బృందం సందర్శించింది. గురుకుల కళాశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్.లింగరాజు మాట్లాడుతూ దళితుల విద్యపై ప్రభుత్వం అసలు శ్రద్ధ తీసుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో భీమడోలు, ద్వారకాతిరుమల మండలాల నిర్వహకులు కట్టా భాస్కరరావు, మండల నాయకులు పోలుకొండ నాగరాజు, మానుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.