
ఉపాధి బకాయిలు చెల్లించాలి
తాడేపల్లిగూడెం రూరల్: ఉపాధి హామీ పథకం కూలీలకు బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని నవాబుపాలెం సచివాలయం వద్ద వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శ్రామికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ 10 నుంచి 12 వారాలు పనిచేస్తే కేవలం రెండు వారాల సొమ్ములు మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కండెల్లి రమేష్‌బాబు, కండెల్లి విజయ, నూతంగి సూర్యారావు, బైపో ప్రసాద్, దిద్దే అబ్బులు, కొల్లి మేరీ, ఉండ్రాజవరపు భాను పాల్గొన్నారు.