
జిల్లా జూనియర్ బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
పెంటపాడు: ప్రత్తిపాడు సరస్వతి విద్యాలయ ఇంగ్లీషు మీడియం స్కూల్లో శనివారం అంతర్ జిల్లాల జూనియర్ బాస్కెట్‌బాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది క్రీడాకారులు పాల్గొనగా 12 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 14 నుంచి 17 వరకు పిఠాపురంలో జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృష్ణారెడ్డి, కార్యదర్శి జి. శ్రీనివాసరావు తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి కె.మురళీకృష్ణ, సరస్వతి విద్యాలయ డైరెక్టర్ కొలనువాడ వెంకట హనుమ సత్యనారాయణరాజు (వెంకట్), స్కూలు పీడీ సత్యకిరణ్, సభ్యులు పాల్గొన్నారు.