
ధర పతనంతో ఆందోళన
ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలో కంటే కూడా నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేశాం. బోర్డు అధికారుల సూచనలు పాటిస్తూ అన్య పదార్థాలు లేకుండా గ్రేడ్ వన్ పొగాకు ఉత్పత్తి చేసి మద్దతు ధర ఆశించాం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ధర పతనం చూస్తుంటే ఆందోళన కలుగుతుంది.
– కాకర్ల వివేకానంద, వర్జీనియా పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు, కొయ్యలగూడెం
సగం కూడా కొనుగోలు చేయలేదు
ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల్లో సుమారు 82 మిలియన్ల కేజీల పొగాకు విక్రయించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అందులో సగం కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతుల వద్ద మిగిలి ఉన్న పొగాకు నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. లోగ్రేడ్ ధర రూ.250కు దిగజారకుండా ఉండగలిగితే రైతుకు కొంతైనా ప్రయోజనం చేకూరుతుంది.
– పరిమి రాంబాబు, వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు, జంగారెడ్డిగూడెం
●

ధర పతనంతో ఆందోళన