గీసుకొండ: మండలంలోని ఊకల్‌లోని సుప్రసిద్ధ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారికి మండల దీక్ష చేపట్టిన స్వాముల సమక్షంలో మంగళవారం ప్రథమ మండల పూజలో భాగంగా జ్యోతి పూజను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు. ఉదయం నుంచే స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించామని, జ్యోతి పూజ పూర్తయిన తర్వాతనే భక్తుల గృహాల్లో ఇతర ప్రాంతాల్లో స్వాములు భిక్షా కార్యక్రమాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమన్నారు. అనంతరం దీక్షా స్వాములతో పాటు విచ్చేసిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, అర్చకులు రాజేష్, కోశాధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వీబీజీరాంజీ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
దుగ్గొండి: గ్రామాల శాశ్వత అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు వీబీజీ రాంజీ నిధులను సద్వినియో గం చేసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం మంగళవారం జరి గింది. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌లు అంశాల వారీగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుందతి, తహసీల్దార్ స మ్మక్క, ఏఓ శ్యామ్, ఎంపీఓ చంద్రమోహన్, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం రమేష్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
బీసీలు ఏకం కావాలి
సంగెం: హక్కుల సాధన కోసం రాజకీయాలకతీతంగా బీసీలు ఏకం కావాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటాపాముల వెంకటరాములు పిలుపునిచ్చారు. ఈ నెల 16న వరంగల్‌లోని శివనగర్‌లో నిర్వహించనున్న బీసీల హక్కుల సాధన సమితి జిల్లా రెండో మహాసభల ప్రచారయాత్రను మంగళవారం సంగెం మండలకేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం చేసి కేంద్రానికి పంపించి తర్వాత ఒకసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. బీసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, ప్రభాకర్, బక్కం రాజు, సాంబయ్య పాల్గొన్నారు.
ఎస్సై, కానిస్టేబుల్
ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
న్యూశాయంపేట: ఇటీవల ప్రభుత్వం పోలీస్ శాఖలో నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వ రకు ఉచిత రెసిడెన్సియల్ శిక్షణ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి హమీద్, ఎస్సీ స్టడీ సర్కిల్ ఉ మ్మడి జిల్లా సంచాలకులు డాక్టర్ కే.జగన్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ నుమకొండ వడ్డేపల్లిలోని షెడ్యూల్ కులాల స్ట డీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాంచిలో శి క్షణ అందించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ల స్వీకరణకు ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9160606862 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
రైస్ మిల్లుల్లో తనిఖీలు
నల్లబెల్లి: నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న రైస్ మిల్లులపై సివిల్ సప్లై రెవెన్యూ అధి కారులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా సివిల్ సప్లై అధికారి సంధ్యారాణి ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని శివశంకర్, సాంబశివ, హైమద్ రైస్ మిల్లులను తనిఖీ చేశారు. మిల్లులో నిల్వ ఉన్న బియ్యం బస్తాలతో పాటు స్టాక్ రిజిస్టర్లు పరిశీలించారు. బియ్యం నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలు పా టించని మూడు మిల్లులను గుర్తించి స్టాక్ నిల్వలను సేఫ్ కస్టడీకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైస్ మిల్లుల యాజమానులు తప్పనిసరిగా సంబంధిత అనుమతులు రెన్యూవల్స్ పూర్తి చేసుకోవాని సూచించారు. ఆర్‌ఐ సంపత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


