నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

Oct 7 2026 2:16 AM | Updated on Oct 7 2026 2:16 AM

రాయపర్తి: విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ను అందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి.మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లిలో నిర్మించిన నూతన 33బై11కెవీ జగన్నాథపల్లి సబ్‌స్టేషన్‌కు సాంకేతిక చార్జింగ్‌ అందించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో ఇప్పటికే ఉన్న 33బై11కెవీ మైలారం, రాయపర్తి సబ్‌స్టేషన్లపై విద్యుత్‌లోడ్‌ భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. మైలారం, రాయపర్తి చుట్టు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుపడడంతో పాటు వోల్టేజీ స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సబ్‌స్టేషన్‌లు, ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ సరఫరా నాణ్యతను మరింత మెరుగు పర్చడానికి టీజీఎన్‌పీడీసీఎల్‌ చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ సీఈ సురేందర్‌, కన్స్ట్రక్షన్‌ సీఈ గౌతమ్‌రెడ్డి, వరంగల్‌ ఎస్‌ఈ ఆనందం, మహబూబాబాద్‌ ఎస్‌ఈ దర్శన్‌కుమార్‌, డీఈ జాటోతు హర్జి విద్యుత్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement