కాశిబుగ్గ: ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అడ్మినిస్ట్రేషన్ విభాగాలతో పాటు రికార్డు రూం, ల్యాబ్, పలు విభాగాలను పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలిస్తూ సంతకం చేసిన వారు ఉన్నారా?లేరా? అంటూ పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అడ్మినిస్ట్రేషన్ అధికారిని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, త్వరలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్తున్న దృష్టా అన్ని పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. అనంతరం ల్యాబ్‌లో చేస్తున్న పరీక్షలను, రిపోర్టులను పరిశీలించారు. టెక్నాలజీ ఉపయోగించి, పేషంట్లకు త్వరగా సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో నోడల్ ఽఅధికారి డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్ మధుకర్ యాదవ్, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. కాగా కలెక్టర్ సత్యశారద పేషంట్ల సేవలతో పాటు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో మూడు గంటలకు పైగా పరిశీలించడంతో అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. కొందరు బయటకు వెళ్లిన ఉద్యోగులు కలెక్టర్ వచ్చారని తెలియగానే ఆగమేఘాల మీద వచ్చి తమ తమ సీట్లలో కూర్చున్నారని తెలిసింది.
లేదంటే షోకాజ్ నోటీసులు
జారీ చేయండి
ఎంజీఎంను ఆకస్మికంగా
తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద
మూడు గంటలకు పైగా
వివిధ విభాగాల్లో పరిశీలన


