నెక్కొండ: నెక్కొండ పీఏసీఎస్‌లో గోనె సంచుల గోల్‌మాల్‌పై మంగళవారం నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి విచారణ చేపట్టారు. ఇటీవల పీఏసీఎస్ పరిధిలోని రైతులు గోనె సంచుల డబ్బులు రాలేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆర్డీఓ మంగళవారం విచారణ నిమిత్తం పీసీఏఎస్‌కు వచ్చారు. అయితే మూడు రోజుల క్రితమే రికార్డులు సిద్ధం చేయాలని సీఈఓ మేకల జనార్దన్, ఆఫీస్ బాయ్ సురేశ్ దృష్టికి తీసుకెళ్లినా.. రికార్డులు సిద్ధం చేయకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ఎన్ని బస్తాల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు? అందుకు ఎన్ని గోనె సంచులు అవసమయ్యాయనే వివరాలు తెలిస్తే రైతుల గోనె సంచుల లెక్క తేలుతుందన్నారు. రికార్డులు లేవని చెప్పడం సరికాదన్నారు. మరోవైపు పీఏసీఎస్ పరిధిలో గోనె సంచులు సుమారు 2.50 లక్షల బస్తాలు కొనుగోళ్లు జరిపామని, అందులో 1.34 లక్షల బస్తాలు రైతులకు ఇచ్చామని, సుమారు 1.16 లక్షల బస్తాలు రైతులవని సీఈఓ తెలిపారు. ఏదిఏమైనా గోనె సంచుల గోల్‌మాల్‌పై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని అటు రైతులు.. ఇటు బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విచారణలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా శ్రీపాల్‌రెడ్డి, నెక్కొండ ఏఎంసీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


