నర్సంపేట: ఆశవర్కర్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం వెంటనే ఇవ్వాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆశ డే సందర్భంగా మంగళవారం పలు ప్రైమరీ హెల్త్ సెంటర్లను విజిట్ చేసి సమావేశాలు నిర్వహించారు. ఈ సంరద్భంగా యువరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఆశ వర్కర్‌కు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి నేటికి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న ఒక్క హామీ నెరవేరలేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఆశకార్యకర్తలు నిరవధిక సమ్మె చేయడానికి కూడా వెనుకడుగు వేయరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువాల లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్య, జిల్లా నాయకురాలు సుజాత, రమ, రజిత, రమ్య, జ్యోతి, కవిత, జ్యోత్స ్న, సృజన తదితరులు పాల్గొన్నారు.


