● మల్లక్‌పేటలో ఘటన
పరకాల : విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పరకాల పట్టణంలోని మాదారం శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పరకాల మండలం మల్లక్‌పేట గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి(50) పట్టణానికి చెందిన పిట్ట సమ్మయ్య వ్యవసాయ కూలీ(పాలేరు)గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం తెల్లవారుజామున చేను వద్దకు వెళ్లిన కుమారస్వామి.. మోటారుకు విద్యుత్ వైరు సరిచేస్తున్న క్రమంలో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనాథలైన అన్నాచెల్లి:
కుమారస్వామి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి రజిత మృతిచెందగా మంగళవారం తండ్రి మృతిచెందాడు. దీంతో కూతురు అకిల, కుమారుడు హరీశ్ అనాథలయ్యారని, వీరిని యజమానితోపాటు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కుమారుడు హరీశ్, కూతురు అఖిల


