అభివృద్ధి పనులు పూర్తిచేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తిచేయండి

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

నవరాత్రి ఉత్సవాలు షురూ

కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి,

వైస్‌ చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

నయీంనగర్‌: కుడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, వైస్‌ చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. కుడా కార్యాలయంలో అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. వరంగల్‌ బస్‌స్టేషన్‌, ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్డు, వేయి స్తంభాల గుడి అభివృద్ధి పనులు, ఉనికిచర్ల, హనుమకొండ చౌరస్తా రీడెవలప్‌మెంట్‌ పనులు పూర్తిచేయాలని సూచించారు. కుడా పీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు.

రుద్రేశ్వరాలయంలో

హన్మకొండ కల్చరల్‌: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలను పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి–నీలిమ దంపతులు సోమవారం ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో వేదపండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్‌, వేముగంటి దత్తుశర్మ సోమవారం ఉదయం 6 గంటల నుంచి పూజలు నిర్వహించారు. వేముల సత్యమూర్తి ఆధ్వర్యంలో నిత్యాన్నప్రసాదాల వితరణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement