హన్మకొండ అర్బన్: జిల్లాలో పశువుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్, 19 పీఎంశ్రీ పాఠశాలల్లో నిధుల వినియోగంపై మంగళవారం వేర్వేరు సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పశువుల నమోదు, టీకాల కార్యక్రమం, రైతుల ఆధార్ అనుసంధానం, పశువైద్యశాలల మ్యాపింగ్ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న వివరాల నమోదును వేగవంతం చేయాలన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమీక్షల్లో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రాధాకిషన్‌న్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర, విజయ డెయిరీ డీడీ ధనరాజ్, గ్రేటర్ ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, పశువైద్యాధికారి గోపాల్‌రావుతోపాటు విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుమాదేవి, లింగ సమానత్వ కోఆర్డినేటర్ సునీత, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ పాఠశాలల్లో
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
అధికారుల సమీక్షల్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


