పరకాల: తెలంగాణ విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిజాం వారసత్వానికి తాకట్టు పెట్టకూడదని కోరారు. పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎంఐఎంతో రాజీపడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ నేపథ్యాన్ని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సమయంలో నోరుమెదపని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు వైద్య కళాశాల కోరుతూ పరకాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలలో వైద్య కళాశాల ఏర్పాటు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్, బీజేపీ జిల్లా కోశాధికారి ఎర్ర రామన్న, కౌన్సిలర్లు కుక్కల విజయ్‌కుమార్, బెజ్జంకి పూర్ణాచారి, నాయకులు పాలకుర్తి తిరుపతి, బాసాని సోమరాజ్, ఆకుల శ్రీధర్ పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి


