ఇంటర్‌ విద్య కీలకం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్య కీలకం

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

ఇంటర్‌ విద్య కీలకం హనుమకొండ బస్‌స్టేషన్‌ నుంచి లోకల్‌ బస్సులు ‘ఎయిర్‌ ఫిల్ట్రేషన్‌’కు పేటెంట్‌ రైస్‌ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలి

విద్యారణ్యపురి: విద్యార్థులకు ఇంటర్‌ విద్య కీలకమని ఇంటర్‌ విద్య ఇన్‌చార్జ్‌ ఆర్‌జేడీ ఎ.గోపాల్‌ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాలలో మంగళవారం విద్యార్థులకు బ్యాగులు, షూ, బెల్టులు పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. త్వరలోనే విద్యార్థులకు యూనిఫామ్‌ కూడా అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఆర్‌.శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు యాకూబ్‌, భిక్షపతి, ఎస్‌.రాజ్‌కుమార్‌, ప్రసాద్‌, రాములు, ప్రవీణ్‌, రమేశ్‌, రేవతి, శ్రీదేవి విద్యార్థులు పాల్గొన్నారు.

హన్మకొండ: ప్రయాణికుల సౌకర్యార్థం వరంగల్‌–కాజీపేట మధ్య హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌, బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రం మీదుగా లోకల్‌ బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌.భవానీప్రసాద్‌ తెలిపారు. రూట్‌ నంబర్‌ 1బీ పేరుతో వరంగల్‌–కాజీపేట, కాజీపేట–వరంగల్‌ మధ్య ప్రతిరోజు 46 ట్రిప్పులు తిప్పుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్‌ నుంచి హనుమకొండ చౌరస్తా, హనుమకొండ బస్టాండ్‌, కాళోజీ కళాక్షేత్రం, అదాలత్‌ మీదుగా కాజీపేటకు, అదేవిధంగా కాజీపేట నుంచి అదాలత్‌, బాలసముద్రం, కాళోజీ కళాక్షేత్రం, అశోకా జంక్షన్‌, హనుమకొండ చౌరస్తా మీదుగా వరంగల్‌కు ఈ బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మరిన్ని ట్రిప్పులు పెంచుతామని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ స్సైన్స్‌ కళాశాల ఫిజిక్స్‌ కాంట్రాక్టు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎల్‌.జితేందర్‌కు ఎయిర్‌ ఫిల్ట్రేషన్‌ పరికరం డిజైన్‌పై పేటెంట్‌ లభించింది. మలేషియాలోని యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ కోలబరేషన్‌లో సంయుక్తంగా పేటెంట్‌ను లభించినట్లు జితేందర్‌ తెలిపారు. భారత ప్రభుత్వ పేటెంట్లు డిజైన్లు, ట్రేడ్‌ మార్కుల కంట్రోల్‌ జనరల్‌ కార్యాలయం నుంచి సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి, అధ్యాపకులు తదితరులు జితేందర్‌ను అభినందించారు.

సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

బీఫార్మసీ, జీవవైవిధ్య ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో మంగళవారం ప్రారంభమైంది. సర్టిఫికెట్ల పరిశీలన ధ్రువపత్రాలను కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.జ్యోతి అభ్యర్థులకు అందజేశారు.

హన్మకొండ అర్బన్‌: కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ఖరీఫ్‌ ధాన్యాన్ని కేటాయించిన రైస్‌ మిల్లులకు పకడ్బందీగా తరలించేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పౌరసరఫరాలు, సహకార శాఖల అధికారులు, ధాన్యం తరలింపు కాంట్రాక్టర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మహేందర్‌, జిల్లా సహకార అధికారి మోహన్‌, పౌరసరఫరాల శాఖ డీటీలు భద్రునాయక్‌, నాగేంద్ర ప్రసాద్‌, భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement