● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
దామెర: పాడి రైతుల ఆర్థికాభివృద్ధి కోసమే పరకాల ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో డెయిరీ స్థలాన్ని మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. మండల కేంద్రంలోని పెద్దగుట్ట పరిసర ప్రాంతంలో డెయిరీ పనులు ప్రారంభిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంలో భాగంగా డెయిరీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన డెయిరీ సొసైటీలో 10 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. ఆయన వెంట డీఈ యుగేంధర్, ఏఈ బాబురావు, తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుబాసి రాజేందర్, జిల్లా నాయకులు బిల్లా రమణారెడ్డి, సదిరం పోశాలు, ప్రకాశ్ రెడ్డి, అనిల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ కచ్చకాయల అరుణ, ల్యాదెళ్ల సర్పంచ్ బొంకూరి రవియాదవ్ తదితరులు ఉన్నారు. అనంతరం మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు అర్థం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు.


