తల్లిపాలే శ్రీరామరక్ష! | - | Sakshi
Sakshi News home page

తల్లిపాలే శ్రీరామరక్ష!

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

నల్లబెల్లి: శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే శ్రీరామరక్ష. ప్రతీ ఏడాది ఆగస్టు మొదటి వారంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ‘స్థిరమైన జీవితానికి తల్లిపాలు.. ఫ లితాన్నిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ఈనెల 1న ప్రారంభమైన వారోత్సవాలు ఏడో తేదీ వరకు సంబంధిత శాఖల సమన్వయంతో అవగా హన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి..

తల్లిపాలు శిశువుకు అవసరమైన అన్ని రకాల పోషకాలను సమృద్ధిగా అందించడంతో పాటు సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలు పట్టించడంతో ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది పడుతుంది. శిశువు జన్మించిన నుంచి తొలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ దశలో నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని వైద్యులు చె బుతున్నారు. ఆ తర్వాత అనుబంధ ఆహారంతో పా టు రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం శిశువు శారీరక, మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరమంటున్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో జిల్లాలో ర్యాలీలు, అవగాహన సదస్సులు, గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించి, ప్రతీ తల్లి శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించేలా చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధా న లక్ష్యమని అధికారులు తెలిపారు.

శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం

ఈనెల 7వ తేదీ వరకు వారోత్సవాలు

జిల్లాలో 919 అంగన్‌వాడీ కేంద్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement