లక్ష్యాలు గడువులోగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాలు గడువులోగా పూర్తి చేయాలి

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

న్యూశాయంపేట: జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా మొక్కలు నాటి పూర్తి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా అటవీశాఖాధికారి నిఖితతో కలిసి జిల్లాస్థాయి మానిటరింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా మొక్కలు నాటడం, లక్ష్యాల సాధన, జియో ట్యాగింగ్‌ పురోగతి, మొక్కల పరిరక్షణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాకు ఈ ఏడాది 25,51,248 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించగా ఇప్పటి వరకు 7,27,612 మొక్కలు నాటడం జరిగిందన్నారు. టార్గెట్‌ పూర్తి చేయని అధికారులను అందుకు గల కారణాలను అడిగి తెలుసుకుని గడువులోగా వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వై.వీ.గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ నాగపద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అవయవదానంపై అవగాహన

జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోన్‌రెడ్డి మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు ఉపేందర్‌రెడ్డి, భారతి, నిర్మల, శ్రీనివాస్‌, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement