వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా ర్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా నుంచి కమిషనర్ టి.వెంకన్న, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు, అర్బన్ చాలెంజ్ ఫండ్, ఇతర పట్టణాభివృద్ధి పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ ప్రాజెక్టు, అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలు కార్యాచరణ ప్రకారం కొనసాగుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ
కార్యదర్శి డాక్టర్ టి.కె.శ్రీదేవి


