దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌లో మొత్తం 153 దరఖాస్తులు రాగా రెవెన్యూశాఖకు 41, జీడబ్యూఎంసీ 30, హౌసింగ్‌ 20, ఇతర శాఖలకు సంబంధించిన 62 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులతో పాటు పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేశ్‌ జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నాగపద్మజ, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement