భీమదేవరపల్లి: భీమదేవరపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి గట్లనర్సింగాపూర్–5 అంగన్‌వాడీ కేంద్రంలో గడువు ముగిసిన పాలు సరఫరా చేయడంతో అవి తాగిన బాలింత అంబాల సుకన్య అస్వస్థతకు గురైంది. పాలప్యాకెట్లు జూలై 8వ తేదీ వరకు మాత్రమే వినియోగించాలని ఎకై ్పరీ డేట్ ముద్రించి ఉంది. పంపిణీదారులు దీన్ని పట్టించుకోకుండా సరఫరా చేయడంతో బాలింత సుకన్య తాగింది. అనంతరం వాంతులు, విరోచనాలయ్యాయి. స్థానికంగా చికిత్స పొందింది. అధికారులు తనిఖీలు చేయకపోవడంతోనే గడువు ముగిసిన పాలప్యాకెట్లు సరఫరా అవుతున్నాయని, కాలం చెల్లిన పాలు తాగడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అస్వస్థతతకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
గడువు ముగిసిన పాలప్యాకెట్


