ఇక..పాఠశాలల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఇక..పాఠశాలల్లో తనిఖీలు

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంలోనూ తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమిస్తూ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం తనిఖీ బృందాల నియమాకానికి పీఎస్‌లు, యూపీఎస్‌లు, హైస్కూళ్ల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. బృందాల ఎంపికలో గతేడాది కొనసాగిన వారిలో పలువురు ఉండగా, మరికొందరిని నూతనంగా ఎంపిక చేశారు. ఎంపికై న వారు ఆయా పాఠశాలల నుంచి రిలీవై తనిఖీ బృందాలుగా విధులు నిర్వర్తించనున్నారు. పలువురు సోమవారం రిలీవ్‌ అయి డీఈఓ కార్యాలయంలో రిపోర్టు చేశారు. వీరిస్థానాల్లో మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తారు. వీరికి కూడా తనిఖీ అంశాలపై ముందుగా శిక్షణ ఇస్తారు.

జిల్లాలో ఏడు తనిఖీ బృందాల ఏర్పాటు:

హనుమకొండ జిల్లాలో పీఎస్‌లకు మూడు టీంలు నియమించారు.

టీం 1లో : టి.హూన్యానాయక్‌ (ఎఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం ఎంపీపీఎస్‌, తరాలపల్లి) నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎస్‌.అనిల్‌కుమార్‌ (ఎస్జీటీ, మల్లికుదురు), వి.శ్రీపాల్‌రెడ్డి (ఎస్జీటీ, జీపీఎస్‌ నయీంనగర్‌) ఉన్నారు.

టీం 2లో : ఎన్‌.ప్రవీణ్‌కుమార్‌ ఎల్‌ఎఫ్‌ఎల్‌ (ఎస్‌జీటీ ఎంపీపీఎస్‌ కుమ్మరిగూడెం) నోడల్‌ ఆఫీసర్‌గా, సభ్యులుగా వి.శ్యాంసుందర్‌ (ఎస్జీటీ, ఎంపీయూపీఎస్‌, తక్కలపాడు), ఎ.శ్రీనివాస్‌ (ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ రేపాకపల్లి) ఉన్నారు.

టీం–3లో : సీహెచ్‌.సుధాకర్‌ (ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ ఒగ్గోనిపల్లి) నోడల్‌ ఆఫీసర్‌గా, సభ్యులుగా సీహెచ్‌.శ్రీనివాస్‌ (ఎస్జీటీ, జెడ్పీహెచ్‌ఎస్‌ ఒంటిమామిడిపల్లి), బి.బ్రాహ్మచారి (ఎస్జీటీ ఎంపీపీఎస్‌ రాంపూర్‌) ఉన్నారు.

● ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షించేందుకు అకడమిక్‌ ప్యానల్‌ తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో యు.నర్సింగరావు (శనిగరం జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌) నోడల్‌ ఆఫీసర్‌గా, సభ్యులుగా వి.రవికుమార్‌ ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం (ఎంపీపీఎస్‌ దేవనూరు), పి.చంద్రయ్య (ఎస్జీటీ ఎంపీపీఎస్‌ కోతులనడుమ) ఉన్నారు.

హైస్కూళ్ల స్థాయి తనిఖీ బృందాలు ఇలా..

టీం–1లో : మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. ఎం.వేణుఆనంద్‌ (జీహెచ్‌ఎం గ్రేడ్‌–2 జెడ్పీహెచ్‌ఎస్‌ రాంపూర్‌) నోడల్‌ ఆఫీసర్‌గా, సభ్యులుగా ఎస్‌ఏలు వివిధ జెడ్పీహెచ్‌ఎస్‌లకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్లు ఈఎస్‌ మహిపాల్‌ పట్నాయక్‌, ఫారూఖ్‌సాదాత అలీ అహ్మద్‌, జి.శ్రీధర్‌రెడ్డి, కె.తిరుపతిరెడ్డి, డి.రమేశ్‌, ఎస్‌.రాము, సీహెచ్‌.సుధాకర్‌, కె.రాజయ్య ఉన్నారు.

టీం–2లో ఏడుగురు : ఎల్‌.రాజేశ్‌ కుమార్‌ (జీహెచ్‌ఎం గ్రేడ్‌–2 జెడ్పీహెచ్‌ఎస్‌, దామెర) నోడల్‌ ఆఫీసర్‌గా, మరో ఆరుగురు సభ్యులుగా స్కూల్‌ అసిస్టెంట్లు కె.మాధవి, సంపత్‌కుమార్‌ కొక్కుల, బి.కృష్ణమూర్తి, బి.రాము, అట్ల రవీందర్‌, ఎస్‌.రమేశ్‌ ఉన్నారు.

టీం–3లో ఏడుగురు : నోడల్‌ ఆఫీసర్‌గా ఎస్‌.రమాదేవి (జీహెచ్‌ఎం –2 జెడ్పీహెచ్‌ఎస్‌ వెల్లంపల్లి), సభ్యులుగా ఎండీ నయీంపాషా, టి.రాముడు, జె.దయాకర్‌, పి.విజేందర్‌, వి.జగన్నాధం, ఆర్‌.సదానందం ఉన్నారు.

ఏమేం తనిఖీ చేస్తారంటే : విద్యాబోధన, విద్యార్థులు అభ్యసనా ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలిస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌, ఉన్నత పాఠశాలల్లో లిప్‌ అమలు, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్టుల విద్యాబోధనను పరిశీలిస్తారు.

● పాఠశాలల సందర్శన సమయాల్లో గమనించిన అంశాల ఆధారంగా స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు ఏజెండాను సిద్ధం చేస్తారు.

అకడమిక్‌ ప్యానల్‌ తనిఖీ బృందాల ఏర్పాటు

పీఎస్‌లకు 3, యూపీఎస్‌లకు 1, హైస్కూళ్లకు 3 టీంల ఎంపిక

మొత్తం 36 మంది ఉపాధ్యాయుల నియామకం

హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ ఉత్తర్వులు జారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement