హన్మకొండ: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్‌తో ఏబీవీపీ చేపట్టిన ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. సోమవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులచే స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. అనుమతి మేరకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. పోలీసులు విద్యార్థులను వెళ్లిపోవాలని సూచించినా పట్టించుకోకపోవడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. ఈక్రమంలో విద్యార్థులు పోలీసులను దాటి వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పోలీసులు కలెక్టరేట్ గేట్ మూసేశారు. ఏబీవీపీ నాయకులు గేట్ ఎక్కి కలెక్టర్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. గేట్ ఎక్కిన విద్యార్థులు అరెస్ట్ చేసి వాహనంలో ఎక్కించే క్రమంలో విద్యార్థులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాచెర్ల రాంబాబు, జూపల్లి దీపిక, సుజిత్, కార్తీక్, బానోతు శ్రవణ్‌కుమార్, ప్రేమ్, రాజకుమార్, అభిలాష్, సంతోశ్, నవీన్, విద్యార్థులు పాల్గొన్నారు.
స్టూడెంట్ మార్చ్‌ను
అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపైనే నిరసన తెలిపిన విద్యార్థులు


