ముఖ్యనాథాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ముఖ్యనాథాలయంలో ప్రత్యేక పూజలు

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

ముఖ్యనాథాలయంలో ప్రత్యేక పూజలు

ధర్మసాగర్‌: కాకతీయుల కాలం నాటి ముప్పారంలోని ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ ముఖ్యనాథస్వామి దేవాలయాన్ని సోమవారం జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ సందర్శించారు. ఈసందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యాటక అధికారికి ముఖ్యనాథస్వామి దేవాలయ పునఃవ్యవస్థాపకులు శివసాని ప్రవీణ్‌ రవీంద్ర ఘనంగా స్వాగతం పలికి, అతిథి మర్యాదలతో ఆహ్వానించారు. స్వామివారి దర్శనం అనంతరం అధికారి శివాజీ ఆలయాన్ని ఆనుకుని ఉన్న చారిత్రక ముఖ్యనాథుని చెరువును, దాని పరిసరాల్లోని ఇనుపరాతి గుట్టలను పరిశీలించారు. అనంతరం అధికారి మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సుందరీకరిస్తే భవిష్యత్‌లో అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అసిస్టెంట్‌ లోకేశ్వర్‌, ఆలయ ప్రధాన అర్చకుడు విక్రమ్‌ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సులుగూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement