● జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: ప్రజావాణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వినతులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతీ వినతిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ సెల్‌లో సోమవారం మొత్తం 252 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌న్‌చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, అధికారులు పాల్గొన్నారు.


