వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వరుణహోమం చేస్తున్న ప్రముఖ వేదపండితులు
వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సోమవారం వరుణయాగం నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛరణలతో రుష్య శృంగారాధన సహిత పట్టాభిషేక పూర్వక వరుణ హోమం(వర్జన్య శాంతి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మార్కెట్ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం నిర్వహించారు. – ఖిలా వరంగల్


