నాకు వెంకటాపూర్ గ్రామంలో 20 గుంటల భూమి ఉంది. నాకు పిల్లలు లేరు. భర్త చనిపోయాడు. నా బాగోగులు చూసే వారు లేరు. భూమిని నా తమ్ముడు నాకు తెలియకుండా ఆయన కూతురు పేరు మీద పట్టా చేశాడు. ఆ పట్టాను రద్దు చేయాలి. నాకు న్యాయం చేయండి.
సంగ యాదమ్మ, ఖిలా వరంగల్
రెండో విడత రివార్డు డబ్బులు ఆపాలి
మాకు చింతలపల్లి శివారులో భూమి ఉంది. ఈ భూమి నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే పోతోంది. సర్వే నంబర్ 538లో ఉన్న ఆ భూమి ఖాతా నంబర్ 59. మాకు తెలియకుండా కొందరు వ్యక్తులు ఆ భూమి మాదేనని ఏ ఆధారం లేకుండా ఫస్ట్ రివార్డు డబ్బులు తీసుకున్నారు. భూమికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. వారికి రెండో విడత రివార్డు డబ్బులు పడకుండా ఆపండి.
సి.కొంరమ్మ, చింతలపల్లి, సంగెం మండలం


