ఒక కాడెడ్ల జత.. రెండు గుంటుకలు | - | Sakshi
Sakshi News home page

ఒక కాడెడ్ల జత.. రెండు గుంటుకలు

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

సంగెం: యాంత్రీకరణ పెరుగుతుండడంతో గ్రామాల్లో రోజురోజుకు సంప్రదాయ వ్యవసాయం కనుమరుగవుతోంది. వ్యవసాయం అంటే కాడెడ్లు. గతంలో ఇంటింటికి ఒకటి నుంచి మూడు నాలుగు జతల కాడెడ్లు ఉండేవి. దుక్కి దున్నడం నుంచి విత్తనం వేయడం పంటలో అంతరకృషి చేయడం వంటి పనులు వాటితోనే చేసేవారు. ప్రస్తుతం యాంత్రీకరణ, పశువుల పోషణ వ్యయం పెరగడం, యువతకు వ్యవసాయంపై ఆసక్తి తగ్గడం వంటి కారణాలతో కాడెడ్ల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో సంగెం మండల కేంద్రంలో ఒక జత కాడెడ్లకు రెండు గుంటుకలు కట్టి పంట చేలల్లో రైతులు సోమవారం అంతర కృషిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement