హల్లో.. నన్ను మర్చిపోయారా! | - | Sakshi
Sakshi News home page

హల్లో.. నన్ను మర్చిపోయారా!

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

హల్లో.. నన్ను మర్చిపోయారా!

ఆత్మకూరు: హల్లో.. నన్ను మర్చిపోయారా.. నేను ఆత్మకూరు జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలోని అసంపూర్తి డైనింగ్‌హాల్‌ను. గత పాలకులు మూడేళ్ల క్రితం నా నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రావట్లేదని కాంట్రాక్టర్‌ మధ్యలోనే వదిలేశాడు. నా నీడన కూర్చుని.. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేద్దామనుకున్న విద్యార్థులు.. అసంపూర్తిగా ఉన్న నన్ను చూసి బాధపడుతున్నారు. ఈరోజు పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కోటి ఆశలతో బడికి వస్తున్న పిల్లలకు నేను మళ్లీ నిరాశనే మిగిల్చనున్నా! నా నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించి పిల్లలకు అందుబాటులోకి తెస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా.

(అసంపూర్తి డైనింగ్‌ హాల్‌ ఆత్మఘోష)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement