● ఉమ్మడి వరంగల్‌లో సగటు కవరేజ్ 30 శాతం మాత్రమే
సాక్షి, వరంగల్: బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) నుంచి రక్షణ కల్పించేందుకు చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఈ నెల 5వ తేదీ నాటికి అధికారిక గణాంకాల ప్రకారం వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మొత్తం 31,304 మంది బాలికలను హెడ్‌కౌంట్ సర్వేలో గుర్తించారు. వీరిలో 9,376 మందికి మాత్రమే హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. దీంతో సగటు కవరేజ్ 30 శాతం వద్దే నిలిచింది.
కవరేజ్
1,254
752
8,034
2,909
5,517
1,729
3,127
1,121
5,674
1,611
2,265
6,687
భూపాలపల్లి
జనగామ
ములుగు
వరంగల్
మహబూబాబాద్
హనుమకొండ
హెడ్‌కౌంట్ సర్వే వ్యాక్సిన్ పొందినవారు
జిల్లాల వారీగా
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పరిస్థితి ఇలా...
36%
29%
28%
31%
33%


