● ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో రెండు గంటలు నరకయాతన
హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఓ సూడి ఆవు రెండు గంటలు నరకయాతన పడింది. ఆ బాధ చూడలేక ఓ సెక్యూరిటీ గార్డు డయల్ 100కు ఫోన్ చేశాడు. సలహా ఇచ్చారే కానీ, ఎవరూ స్పందించలేదు. చివరికి తెలిసిన వారి నుంచి మడికొండ వెటర్నరీ అసిస్టెంట్ రమేశ్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అజీర్తితో బాధపడుతున్నట్లు గు ర్తించి వైద్యం అందించాడు. కాగా, ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవం.. హనుమకొండ పరిధి పశు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించలేదని పలువురు వాహనదారులు చెప్పడం గమనార్హం. – హన్మకొండ చౌరస్తా


