అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం

Mar 21 2026 5:58 AM | Updated on Mar 21 2026 5:58 AM

అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం

కొత్త ప్రాజెక్టులు జీరో..

పాత పనుల కొనసాగింపు

ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు

యూజీడీ, మామునూరు సహా కీలక

ప్రాజెక్టులకు పద్దులు లేవు

అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం..

ఆరు గ్యారంటీలకు ఆదరణ

సాగునీరు, వ్యవసాయరంగాలు,

మహిళల సంక్షేమానికి పెద్దపీట

ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా..

గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్‌ఐఎస్‌) ప్రాజెక్టు ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.5 కోట్లు జేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు మామునూరు వెటర్నరీ సైన్స్‌ కళాశాలకు రూ.25 కోట్లు వరంగల్‌లోని రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌కు రూ. 30 లక్షలు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) రూ. 93.22 కోట్లు కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి రూ. 60 లక్షలు వరంగల్‌, కరీంనగర్‌ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు జనగామలో ప్రభుత్వ కోకోన్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ.2.53 కోట్లు

అవీ, ఇవీ, అన్నీ..

వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది.

ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్‌లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్‌ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి.

గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్‌ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్‌ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement