నేడు ఈద్‌–ఉల్‌–ఫితర్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ఈద్‌–ఉల్‌–ఫితర్‌

Mar 21 2026 5:58 AM | Updated on Mar 21 2026 5:58 AM

నేడు ఈద్‌–ఉల్‌–ఫితర్‌

ఎంతో నిష్టతో కూడిన నెలరోజుల కఠిన రంజాన్‌ ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఆత్మశుద్ధి, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచే రంజాన్‌ మాసానికి వీడ్కోలు పలుకుతూ సంతోషాల పండుగ ఈద్‌–ఉల్‌–ఫితర్‌ రానే వచ్చింది. నేడు (శనివారం) ముస్లింలు రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించుకోనున్నారు. వరంగల్‌ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలతోపాటు గ్రామాలు కోలాహలంగా మారాయి. వరంగల్‌లోని ప్రధాన ఈద్గా మైదానాలను చదును చేసి సామూహిక ప్రార్థనలు చేసుకునేందుకు కార్పెట్లు, షామియానాలు ఏర్పా టు చేశారు. విద్యుత్‌ దీపాలతో పరిసరాలను అందంగా అలంకరించారు.

– న్యూశాయంపేట

రంజాన్‌ వేడుకలకు ముస్తాబైన జిల్లా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement