వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Mar 21 2026 5:58 AM | Updated on Mar 21 2026 5:58 AM

భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో అర్చన

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
భద్రకాళి అమ్మవారికి లిల్లీ పూలతో అర్చన

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన సూరినేని నవీన్‌రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, సిబ్బంది పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement