న్యూశాయంపేట : అంతరించి పోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్కు క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీటిని అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ ఎన్‌జీఓ ప్రతినిధులు నాగేశ్వర్‌రావు, శ్యాంసుందర్, రవిబాబు పాల్గొన్నారు.


