సంగెం: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరంలో గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కొమురయ్య, తహసీల్దార్ రాజ్‌కుమార్, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, డాక్టర్ నవీన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధికి దిక్సూచి కూసం రాజమౌళి
గీసుకొండ: జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి గ్రామాలకు దిక్సూచిగా నిలిచి నిరూపించారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. బుధవారం గంగదేవిపల్లిలో రాజమౌళి సంతాప సభ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.నాగయ్య నాయకులు సీహెచ్ రంగయ్య, ఇసంపల్లి బాబు, భూక్యా సమ్మయ్య, బ్రహ్మచారి, రత్నమాల, పెద్దారపు రమేశ్, సర్పంచ్ కూసం స్వరూప, రాజమౌళి కుమారులు ఈశ్వర్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


