● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.కలెక్టర్ చాంబర్‌లో బుధవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, ఎండోమెంట్ ఏడీ సునీత, జిల్లా టూరిజం అధికారి శివాజీ, జిల్లా స్పోర్ట్ అధికారి అనిల్, ఆర్కియాలజీ ఏడీ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా నుంచి వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ హైవే –163జీలో భూములు కోల్పోయిన రైతులతో కలెక్టర్ ఆర్బిట్రేషన్ నిర్వహించారు.
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
పరాభవ నామ సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ సత్యశారద జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని కలెక్టర్ ఆక్షాంక్షించారు.


