ఖానాపురం: ఉపాధి హామీ కాంపోనెంట్ నిధులపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సర్పంచ్‌లు బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అన్ని గ్రామాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయానికి బుధవారం తాళం వేసి ప్లకార్డులతో నినాదాలు చేశారు. కలెక్టర్, డీఆర్డీఓ పీడీ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. అధికారులు కార్యాలయంలోనే ఉండిపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్సై రఘుపతి, ఎంపీడీఓ సునీల్‌కుమార్ తెలుపడంతో నిరసన విరమించారు. కార్యాలయానికి వేసిన తాళాన్ని ఎస్సై తొలగించారు. బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మాడ్రాజు వెంకన్న, సర్పంచ్ దాసరి రమేశ్, సర్పంచ్‌లు బానోత్ వీరన్న, కూస విమల, గొంది సుజాత, బాధావత్ జ్యోతి, బాదరబోయిన నరేశ్ ఉన్నారు.


