అంగన్‌వాడీల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల అభివృద్ధికి కృషి

Mar 17 2026 8:52 AM | Updated on Mar 17 2026 8:52 AM

నర్సంపేట: అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెండెం శ్రీలక్ష్మీరామానంద్‌ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సోమవారం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీఓ మధురిమ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మహిళాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తల్లీబిడ్డలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. మున్సిపల్‌ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్‌ శ్రీరామోజు రోజారాణి పొన్నం నర్సింహారెడ్డి, సూపర్‌వైజర్స్‌ రమ, అరుణ, పారిజాతం, రాధ, హేమలత, నజ్మా, విజయరాణి, భాగ్యమ్మ, వాసంతి, అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, గొర్రె రాధ, బత్తిని శిరీష, అంగన్‌వాడీ టీచర్స్‌ పాల్గొన్నారు.

సాంకేతిక వ్యవసాయంపై దృష్టి సారించాలి

వ్యవసాయ శాస్త్రవేత్త గోన్యానాయక్‌

నెక్కొండ: వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో రైతులు సాంకేతిక యాజమాన్య వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) శాస్త్రవేత్త గోన్యానాయక్‌ అన్నారు. మండలంలోని తోపనపల్లిలోని రైతువేదికలో సోమవారం ఆత్మ సహకారంతో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. వరిలో ప్రాధాన్య రకాల ప్రోత్సాహకం, వరిలో స్వల్ప, మధ్యస్త, దీర్ఘకాలిక రకాల గురించి రైతులతో ఆయన చర్చించారు. హెచ్‌టీ పత్తి సాగు యొక్క ప్రతికూల ప్రభావాలు, భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువుల వాడకం, సమీకృత వ్యవసాయం పద్ధతులను పాటించాలన్నారు. ఈ సమావేశంలో ఏఓ నాగరాజు, సర్పంచ్‌ చాగంటి మమత, ఏఈఓలు, రైతులు బొప్పిడి కిషన్‌రెడ్డి, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement