ఉపాధి కూలీలకు వసతులు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు వసతులు

Mar 17 2026 8:52 AM | Updated on Mar 17 2026 8:52 AM

నల్లబెల్లి: మండలకేంద్రంలోని పెద్దచెరువులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపడుతున్న కూలీలకు అధికారులు, ప్రజాపతినిధులు సోమవారం వసతులు కల్పించారు. ఆదివారం సాక్షిలో ప్రచురితమైన శ్రీకరువుశ్రీ పనుల్లో కష్టాలు! అనే కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. అధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్‌ నాగెల్లి జ్యోతిప్రకాష్‌ స్పందించి వార్డు సభ్యులతో కలిసి నల్లబెల్లి పెద్ద చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు సందర్శించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో నీడ కోసం పరదాలను ఏర్పాటు చేశారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. మంచినీటిని సరఫరా చేశారు. పని ప్రదేశంలో వసతుల కల్పనలో ఏమైన ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆమె వెంట వార్డు సభ్యులు పెద్దబోయిన రాజన్న, నాగెల్లి అనిల్‌, పరికి రమ కొర్నేల్‌, భూస రాజేశ్వరి లచ్చన్న, టెక్నికల్‌ అసిస్టెంట్‌ నరేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బత్తిని మధు, ఆశ కార్యకర్తలు ప్రియదర్శిని, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement