● అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రేణుకాదేవి
సంగెం: రుణ వాయిదాల రికవరీని వేగవంతం చేయాలని, గ్రామస్థాయిలో సీసీలు, వీఓఏలు, మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని డీఆర్‌డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ రేణుకాదేవి ఆదేశించారు. సోమవారం శాంతి మండల సమాఖ్యలో మహిళా సంఘాలకు రుణాల జారీ, సీ్త్రనిధి రుణాల రికవరీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్రనిధి రుణాలు బాకాయిలు బాగా పేరుకుపోయాయని, మార్చి 31 నాటికి రూ 1.79 కోట్ల రుణ బకాయిలను రికవరీ చేయాలన్నారు. రుణాల రికవరీలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజ్‌కుమార్, సీసీలు కృష్ణమూర్తి, రవీందర్ రాజు, కుమారస్వామి, ఏలియా, రాజయ్య, వీఓఏలు పాల్గొన్నారు.


