హన్మకొండ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే దేశంలో చమురు సంక్షభం సంభవించిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు కట్ట్టెలతో వంటలు చేసి, ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని, చమురు సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. గృహ వినియోగ సిలిండర్లపై రూ.60, వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెరుగుదలతోపాటు అనేక ప్రాంతాల్లో లభ్యత లేకపోవడంతో, వంట గ్యాస్ పొందడానికి ప్రజలు మండే ఎండలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి, నాయకులు కరుణాకర్, సదాలక్ష్మి, ఎల్లేష్, లింగారెడ్డి, రాములు, లక్ష్మణ్, ఎన్‌ఏ.స్టాలిన్, వెంకట్రాజం, భిక్షపతి, సదానందం, రవి, శంకర్ నాయక్, వెంకటేష్, రమేష్, సారంగపాణి, నర్సయ్య, రాజేందర్, వెంకటరమణ, స్వరూప, రాజయ్య పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు


