విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలను సోమవారం నుంచి ఒక్కపూట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7–45 నుంచి మధ్యాహ్నం 12–30 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలున్న రోజు మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు.


